ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి ప్లీజ్..

ABN, First Publish Date - 2020-03-26T22:29:59+05:30

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 వేల మంది మరణించారు. దాదాపు 4.86లక్షల మందికి వైర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 వేల మంది మరణించారు. దాదాపు 4.86లక్షల మందికి వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో నైజీరియాలోని తెలుగు ఎన్నారైలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తెలుగు వారు అక్కడ పడుతున్న ఇబ్బందులను రాజేంద్రరెడ్డి అనే వ్యక్తి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. భారత్‌కు చెందిన ఓ వ్యక్తికి నైజీరియాలో రిఫైనరీ పరిశ్రమ ఉందనీ.. అందులో సుమారు 10 వేలమంది భారతీయులు పని చేస్తున్నారని తెలిపారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 250 ఉంది ఉన్నట్లు చెప్పారు. అయితే నైజీరియాలో కూడా కరోనా ప్రభావం ఉన్నప్పకిటీ.. పరిశ్రమ యాజమాన్యం తమ యోగక్షేమాలపై శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ కరోనా బారినపడితే.. చికిత్స చేయించుకునేందుకు కూడా అక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేవన్నారు. తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఇండియాకు రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.  ఇదిలా ఉంటే.. కరోనా కట్టడికి భారత ప్రభుత్వం సహా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రాజేంద్రరెడ్డి అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2020-03-26T22:29:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising