ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న ‘తానా’

ABN, First Publish Date - 2020-06-18T08:32:13+05:30

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నాన్నా-నీకు నమస్కారం’ అంటూ జూన్ 21,2020న అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తానా పేర్కొంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సిరివెన్నెల సీతారామశాస్త్రీ, తనికెళ్ల భరణి హాజరవుతారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నాన్నా-నీకు నమస్కారం’ అంటూ జూన్ 21,2020న అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తానా పేర్కొంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సిరివెన్నెల సీతారామశాస్త్రీ, తనికెళ్ల భరణి హాజరవుతారని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారథి డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రకటించారు. 


ఇదిలా ఉంటే.. ‘ఘనుడు నాన్న-త్యాగధనుడు నాన్న’ అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా కవితా పోటీలు నిర్వహించినట్లు సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీలకు విశేష స్పందన లభించిందని చెప్పారు. విజేతలకు జూన్ 21న బహుమతి ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు. ‘నాన్న-నీకు నమస్కారం’ వేడుకలో భాగంగా కవుల కవితాగానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న వేడుకలను (అమెరికా CDT 11:00 am, ఇండియా 9:30 pm) తానాకు సంబంధించిన ఫేస్‌బుక్‌ పేజ్, యూట్యూబ్ చానెల్ ద్వారా వీక్షించవచ్చని చిగురుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. మరింత సమాచారం కోసం www,tana.orgని సందర్శించాలని కోరారు. 


Updated Date - 2020-06-18T08:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising