ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'స్వీడన్ తెలుగు కమ్యూనిటీ' ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం'

ABN, First Publish Date - 2020-08-30T17:23:33+05:30

స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో 'స్వీడన్ తెలుగు కమ్యూనిటీ' ఆధ్వర్యంలో శనివారం తెలుగు విద్యార్థులు, తల్లిదండ్రులు 'తెలుగు భాషా దినోత్సవం' ఘనంగా జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టాక్ హోం: స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో 'స్వీడన్ తెలుగు కమ్యూనిటీ' ఆధ్వర్యంలో శనివారం తెలుగు విద్యార్థులు, తల్లిదండ్రులు 'తెలుగు భాషా దినోత్సవం' ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'స్వీడన్ తెలుగు కమ్యూనిటీ' చైర్మన్ సురేంద్ర అలుగునూల మాట్లాడుతూ తోటి తెలుగు వారు, పిల్లలతో కలిసి స్వీడన్‌లో మొదటిసారిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సంప్రదాయం ఇలానే కొనసాగిస్తూ పిల్లలకు తెలుగు పట్ల ఆసక్తిని రెకేత్తించ్చే విధంగా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలని కోరారు.


ఈ సందర్భంగా పిల్లలకు తెలుగు చదవడం, రాయడం, వినడం, కథాకథనం, తెలుగులో క్విజ్, పద్యాలు, గేయాలు వంటి పోటీ కార్యక్రమాలను ప్రాథమిక, మధ్యమ స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీ కార్యక్రమాలలో ఐదు నుండి పదిహేను సంవత్సరాల పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు కార్యక్రమం చివరలో బహుమతులు, ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 'స్వీడన్ తెలుగు కమ్యూనిటీ' బోర్డు సభ్యులు ప్రవీణ్ రంగినేని, గంగాధర్ నీరడి, నిరంజన్ కోమాండ్ల, రమ పాలడుగు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో దీపికా గూడ, రమేష్ దేసు, ప్రత్యూష భూపతి తదితరులు సహకరించారు. 


Updated Date - 2020-08-30T17:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising