మహిళ ఘనకార్యం.. 26లక్షల విలువైన సరుకులు నేలపాలు!
ABN, First Publish Date - 2020-03-27T22:21:52+05:30
కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 24వేలకు చేరింది. 5.42లక్షల మంది కొవిడ్-
వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 24వేలకు చేరింది. 5.42లక్షల మంది కొవిడ్-19 బారినపడ్డారు. ప్రపంచ దేశాలన్ని కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా అమెరికా కూడా ప్రజలపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ అగ్రరాజ్యం అమెరికాపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్-19 మరింత ప్రబలకుండా జాగ్రత్తపడుతూనే.. నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ చేసిన ఘనకార్యం వల్ల 35వేల డాలర్లు(26లక్షల)విలువైన నిత్యావసర సరుకులు నేలపాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఓ మహిళ.. కరోనా నేపథ్యంలో ప్రజలను ఫ్రాంక్ చేద్దామని భావించింది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ఆ మహిళ.. అక్కడ ఉన్న నిత్యావసర సరుకులపై దగ్గుతూ హల్‌చల్ చేసింది. దీంతో సూపర్ మార్కెట్ ప్రతినిధులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను అరెస్టు చుసి, కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించనున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా.. సుమారు 35వేల డాలర్ల విలువైన నిత్యావసర సరుకులను డంప్‌యార్డ్‌కు తరలించినట్లు సూపర్ మార్కెట్ ప్రతినిధులు తెలిపారు.
Updated Date - 2020-03-27T22:21:52+05:30 IST