ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ చేతుల మీదుగా అమెరికా పౌరసత్వం అందుకున్న భారతీయురాలు

ABN, First Publish Date - 2020-08-27T19:25:34+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా భారత మహిళా టెకీ సుధా సుందరి నారాయణ్ అమెరికన్ పౌరసత్వం అందకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా భారత మహిళా టెకీ సుధా సుందరి నారాయణ్ అమెరికన్ పౌరసత్వం అందకున్నారు. మంగళవారం వైట్ హౌజ్ లో జరిగిన ‘నేచురలైజేషన్’ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ భార‌తీయురాలికి స్వ‌యంగా అమెరికా పౌర‌స‌త్వ పట్టాను అందించడం విశేషం. దీంతో ట్రంప్ స‌మ‌క్షంలో సుధా ఆ దేశస్థురాలిగా ప్రమాణం చేశారు. 13 ఏళ్ల క్రితం ఇండియా నుంచి అగ్రరాజ్యానికి వెళ్లిన సుధా అక్క‌డ సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా స్థిరపడ్డారు. తాజాగా అమెకు అమెరికా పౌర‌స‌త్వం ల‌భించింది. 


ఇక ‘నేచురలైజేషన్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ సుధాను ప్రశంసలతో ముంచెత్తారు. 13 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చిన సుధా అద్భుతమైన విజయానికి చిహ్నాం అని కొనియాడారు. తమ అసమాన, అద్భుత దేశంలో భాగమైనందుకు ఆమెను అభినందించారు. అద్భుత ప్రతిభ గల ఆమెను, ఆమె భర్తను అభినందించారు. వీరి ఇద్దరు పిల్లలను ఆయన ‘బ్యూటిఫుల్ యాపిల్స్ ఆఫ్ దెయిర్ లైఫ్‘గా అభివర్ణించారు. సుధాతో పాటు లెబనాన్, ఘనా, బొలీవియా, సూడాన్ దేశాలకు చెందిన‌ మరో నలుగురు ప్రవాసులు కూడా ఈ సంద‌ర్భంగా అమెరికా పౌరసత్వం అందుకున్నారు. 

Updated Date - 2020-08-27T19:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising