ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలుపు ట్రంప్‌దేనంటున్న అమెరికా స్టాక్‌మార్కెట్!

ABN, First Publish Date - 2020-11-04T05:18:46+05:30

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ కొద్ది గంటల క్రితమే ప్రారంభమైంది. అమెరికా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేకునేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ కొద్ది గంటల క్రితమే ప్రారంభమైంది. అమెరికా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేకునేందుకు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సర్వేలు మొత్తం డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌దే గెలుపు అని తేల్చి చెబుతున్నాయి. ట్రంప్ మాత్రం పోల్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదని.. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ‘ఎస్‌అండ్‌పీ 500’ ఎన్నికల్లో గెలిచేది ట్రంపేనని చెబుతోంది. అదెలా అంటారా? అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎస్‌అండ్‌పీ 500 లాభాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ విజయం సాధిస్తుందని.. ఒకవేళ ఇండెక్స్ నష్టాల్లోకి వెళ్తే అధికారం మారుతుందని ఎస్‌అండ్‌పీ అంచనా వేస్తోంది. 


స్టాక్‌మార్కెట్ చరిత్రను చూసుకుంటే 1984 ఎన్నికల నుంచి 2016 ఎన్నికల వరకు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందని అంచనా వేసిందో 87 శాతం వరకు ఆ పార్టీ నాయకులే అధ్యక్ష పీఠాన్ని అందుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి ఈ మార్కెట్ ఇండెక్స్ మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జూలై 31 నుంచి సోమవారం వరకు మార్కెట్ ఇండెక్స్ 1.2 శాతం పెరిగింది. మార్కెట్ పెరుగుతూ పోవడం చూస్తోంటే గెలుపు ట్రంప్‌‌దేనని తనకు అనిపిస్తోందని చికాగోకు చెందిన మ్యాట్రిక్స్ ఎగ్జె‌క్యూషన్ గ్రూప్ సీఈఓ ఆంథనీ అభిప్రాయపడ్డారు. అధ్యక్షులుగా గెలుస్తారని ఎస్‌అండ్‌పీ అంచనా వేసి అనుకున్న విధంగానే గెలిచిన వాళ్లలో బరాక్ ఒబామా, జార్జ్ బుష్, రోనాల్డ్ రీగన్ అన్నారు. జార్జ్ బుష్ రెండో సారి కూడా గెలుస్తారని వేసిన అంచనా మాత్రం తారుమారైంది.

Updated Date - 2020-11-04T05:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising