ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంక జైలులో ఘర్షణ.. 8 మంది మృతి

ABN, First Publish Date - 2020-12-01T08:59:09+05:30

శ్రీలంకలోని మహారా జైలులో ఘర్షణలు చోటు చేసుకుని ఎనిమిది మంది ఖైదీలు మృతి చెందారు. మరో 37 మందికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో, నవంబరు 30: శ్రీలంకలోని మహారా జైలులో ఘర్షణలు చోటు చేసుకుని ఎనిమిది మంది ఖైదీలు మృతి చెందారు. మరో 37 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు జైలర్లు ఉన్నారు. గాయాలపాలైన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జైలులో తమకు కరోనా సోకే ముప్పు ఉందంటూ మహారా జైలు ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో  ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొందరు ఖైదీలు జైలులో నుంచి పారిపోవడానికి బలవంతంగా జైలు తలుపును తెరవడానికి యత్నించారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని వివరించారు. ఖైదీల్లో కొందరు వంటగదితో పాటు మరో గదికి నిప్పుపెట్టారని చెప్పారు. కాగా, జైళ్లలో తమకు కరోనా సోకే ముప్పు ఉందన్న భయంతో శ్రీలంకలోని పలు జైళ్లలో ఖైదీలు కొన్ని వారాల నుంచి తరుచూ ఆందోళనలకు దిగుతున్నారు.  

Updated Date - 2020-12-01T08:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising