ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిస్ఇన్‌ఫెక్టెంట్ల ద్వారా నష్టమే తప్ప లాభం లేదు: డబ్ల్యూహెచ్ఓ

ABN, First Publish Date - 2020-05-17T08:32:17+05:30

కరోనాను నియంత్రించేందుకు అనేక దేశాల్లో డిస్ ఇన్‌ఫెక్టెంట్లను స్ప్రే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించేందుకు అనేక దేశాల్లో డిస్ ఇన్‌ఫెక్టెంట్లను స్ప్రే చేయిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో ఏ ఒక్క వీధిని వదలకుండా అధికారులు స్ప్రే చేయిస్తున్నారు. అయితే వీటి ద్వారా నష్టమే తప్ప లాభం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. వీధుల్లో డిస్‌ఇన్‌ఫెక్టెంట్ స్ప్రే చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వీధులు, పేవ్‌మెంట్లను ఇన్‌ఫెక్షన్ కేంద్రాలుగా భావించడం లేదని తెలిపింది. డిస్‌ఇన్‌ఫెక్టెంట్లను స్ప్రే చేయమని డబ్ల్యూహెచ్ఓ ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేసింది. డిస్‌ఇన్‌ఫెక్టెంట్లు స్ప్రే చేసినంత మాత్రాన.. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ వ్యాప్తి ఆగదని పేర్కొంది. క్లోరిన్, ఇతర విష రసాయనాలను జల్లడం వల్ల మనుషులు అనేక ఇబ్బందులకు గురవుతారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. డిస్‌ఇన్‌ఫెక్టెంట్ స్ప్రే చేయాలంటే.. అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా.. కరోనా వైరస్ వస్తువులపై ఎంత సమయం బతికి ఉంటుందన్న దానిపై ఇప్పటివరకు సరైన సమాధానం రాలేదు. వస్తువులపై వైరస్ వారం రోజుల పాటు ఉంటుందని అనేక స్టడీస్ తెలిపాయి.

Updated Date - 2020-05-17T08:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising