ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ!

ABN, First Publish Date - 2020-07-11T21:13:01+05:30

సింగపూర్‌లో శుక్రవారం రోజు జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ ఢంకా మోగించింది. సింగపూర్‌లో 93పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అధికార ‘పీపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్: సింగపూర్‌లో శుక్రవారం రోజు జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ ఢంకా మోగించింది. సింగపూర్‌లో 93పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అధికార ‘పీపుల్స్ యాక్షన్ పార్టీ’ 83 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘వర్కర్స్ పార్టీ’కేవలం 10స్థానాలకే పరిమితం అయింది. సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ తన నియోజకవర్గం అంగ్ మో కియో నుంచి తిరిగి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పీఏపీ పార్టీ విజయం సాధించడంతో.. లీ హసీన్ లూంగ్ మరోసారి అధికారపగ్గాలు చేపట్టనున్నారు. కరోనా నేపథ్యంలో సింగపూర్ ప్రజలు.. గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఓట్లు వేశారు. ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో ఇప్పటి వరకు 45వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 41వేల మంది కొవిడ్-19 జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్ఝ్ అయ్యారు. 26 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.


Updated Date - 2020-07-11T21:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising