ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంజాన్ సందర్భంగా.. విదేశీ కార్మికుల కోసం సింగపూర్‌లో..

ABN, First Publish Date - 2020-05-25T21:31:59+05:30

రంజాన్ సందర్భంగా సింగపూర్‌కు చెందిన దుష్యంత్ కుమార్ అనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్: రంజాన్ సందర్భంగా సింగపూర్‌కు చెందిన దుష్యంత్ కుమార్ అనే వ్యాపారవేత్త 600 మంది విదేశీ కార్మికుల కోసం ప్రత్యేకంగా బిర్యాని వండించారు. సింగపూర్‌లో అత్యధికంగా బంగ్లాదేశ్, చైనా, భారత్‌కు చెందిన వారే ఉండటంతో.. ఆయా దేశాలకు తగ్గట్టు బిర్యాని వండంచినట్టు దుష్యంత్ తెలిపారు. విదేశీ కార్మికులు సింగపూర్‌లో డార్మిటరీలలో నివసిస్తున్నారని.. వారికి మంచి ఆహారం దొరకడం లేదని దుష్యంత్ కుమార్ అన్నారు. వారంతా కుటుంబాలతో కలిసి ఉంటే కనీసం మంచి భోజనం అయినా చేస్తూ ఉండేవారని దుష్యంత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా కార్మికుల కోసం బిర్యానిని వండించామని అన్నారు. కాగా.. ఏప్రిల్ నెల నుంచి అనేక సంస్థల సహాయంతో దుష్యంత్ కుమార్ నిత్యం వెయ్యి మంది విదేశీ కార్మికులకు భోజనం పెడుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో దాదాపు 3 లక్షల మంది విదేశీ కార్మికులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో విదేశీ ఉద్యోగులకు మంచి భోజనం అందించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆయా కంపెనీలను ఆదేశించింది. మరోపక్క చారిటీల ద్వారా ప్రభుత్వం కూడా విదేశీ కార్మికులకు మంచి ఆహారం అందిస్తున్నట్టు తెలిపింది. కాగా.. సింగపూర్‌లో ఇప్పటివరకు 30 వేల మందికి పైగా కరోనా బారిన పడగా.. ఇందులో అత్యధిక శాతం మంది డార్మిటరీలలో జీవిస్తున్న విదేశీ కార్మికులే ఉండటం గమనార్హం.

Updated Date - 2020-05-25T21:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising