ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు సిక్కు సంఘం ధన్యవాదాలు

ABN, First Publish Date - 2020-08-06T23:46:18+05:30

శ్వేత జాత్యహంకారి చేతిలో అన్యాయంగా ఆరుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోయి ఎనిమిది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: శ్వేత జాత్యహంకారి చేతిలో అన్యాయంగా ఆరుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోయి ఎనిమిది సంవత్సరాలు గడవడంతో.. సిక్కు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ శ్వేత జాత్యహంకారి ఎనిమిదేళ్ల క్రితం(2012 ఆగస్టు 5వ తేదీన ) విస్కాన్సిన్‌లోని ఓక్ క్రీక్‌లో ఉన్న సిక్కు దేవాలయాన్ని టార్గెట్ చేసి అన్యాయంగా, కిరాతకంగా ఏడుగురి ప్రాణాలు బలిగొన్నాడు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే మనమంతా ఈ మూర్ఖత్వానికి ఎదురు నిలబడి హింసను నిర్మూలించాలి’ అని అన్నారు. కాగా.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికి తమ కోసం వచ్చినందుకు జో బైడెన్‌కు నేషనల్ సిక్క్ క్యాంపెయిన్(ఎన్ఎస్‌సీ) సహవ్యవస్థాపకులు డాక్టర్ రాజ్వంత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఓక్ గ్రీక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అందించిన సేవలు మరువలేనివి అని ఆయన అన్నారు. ఆ సమయంలో ఘటనాస్థలానికి ముందుగా వెళ్లిన బ్రైన్ మర్ఫీ అనే పోలీసు అధికారి ఎందరో ప్రాణాలను కాపాడి తాను మరణించాడని గుర్తుచేశారు. ఓక్ గ్రీక్ మేయర్, గవర్నర్ స్కాట్ వాకర్, మాజీ అధ్యక్షుడు ఒబామా ఆ సమయంలో తమకు అండగా నిలిచారన్నారు. లక్షలాది మంది అమెరికన్లు ఆ సమయంలో సిక్కులకు మద్దతుగా నిలిచి తమ పట్ల ప్రేమను చాటుకున్నారని, దీనికి తాము ఎన్నటికి రుణపడి ఉంటామని రాజ్వంత్ సింగ్ చెప్పారు. జో బైడెన్ చెప్పిన విధంగా మూర్ఖత్వానికి, జాత్యహంకారానికి ఎదురు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన తుపాకీ దాడిలో ఆరుగురు సిక్కులు(ఐదుగురు మగవారు, ఒక ఆడవారు), ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-08-06T23:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising