ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోడాజెనిక్స్‌’ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించిన ‘సీరం’

ABN, First Publish Date - 2020-09-23T12:13:14+05:30

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో భారత్‌లో ప్రయోగ పరీక్షలు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 : ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో భారత్‌లో ప్రయోగ పరీక్షలు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ‘కోడాజెనిక్స్‌’ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ (సీడీఎక్స్‌ - 005) ఉత్పత్తికి ఆ కంపెనీతో జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఉత్పత్తి ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.


ఇక మరోవైపు ఆ వ్యాక్సిన్‌తో మనుషులపై తొలిదశ ప్రయోగ పరీక్షలు డిసెంబరుకల్లా బ్రిటన్‌లో ప్రారంభం కానున్నాయి. అయితే దీన్ని సాధారణ ఇంజెక్షన్‌లా కాకుండా.. ముక్కు ద్వారా అందించనున్నారు.


సాధారణ ఇంజెక్షన్‌ ద్వారా వ్యాక్సిన్‌ అందించినప్పుడు అది జీర్ణాశయాంతర పేగులు (గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌), కాలేయాల మీదుగా ప్రవహించి చివరగా రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతుంది. ఈక్రమంలో జరిగే వడపోతల కారణంగా వ్యాక్సిన్‌లోని ఔషధంలో కొంతభాగం వ్యర్థమవుతుంది. నాసికా కుహర మార్గం ద్వారా వ్యాక్సిన్‌ను అందిస్తే ఈ తరహాలో ఔషధం వ్యర్ధమయ్యే అవకాశం ఉండదు. 

Updated Date - 2020-09-23T12:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising