ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

37 మంది స్కూలు పిల్లలపై కత్తితో దాడి చేసిన సెక్యూరిటీ గార్డ్.. చైనాలో..

ABN, First Publish Date - 2020-06-04T21:10:13+05:30

స్కూలు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి 37 మంది పిల్లలపై, ఇద్దరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: స్కూలు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి 37 మంది పిల్లలపై, ఇద్దరు టీచర్లపై కత్తితో దాడి చేశాడు. చైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో ఈ విషాధ సంఘటన చోటుచేసుకుంది. వాంగ్‌ఫూ సెంట్రల్ ప్రైమరీ స్కూల్‌లో గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు స్కూలుకు వచ్చిన కాసేపటికే ఈ దాడి జరిగినట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు స్వల్ప గాయాలే కావడంతో 37 మంది కూడా సురక్షితంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోపక్క ఇద్దరు టీచర్లకు కత్తి దాడిలో తీవ్ర గాయాలయ్యాయని.. అయితే ప్రాణాపాయస్థితిలో లేరని వైద్యులు చెప్పారు. సెక్యూరిటీ గార్డ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. 50ల వయసున్న నిందితుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చైనాలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగినట్టు తెలుస్తోంది. కాగా.. చైనాలో లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా నెలల తరువాత మే నెలలోనే స్కూళ్లు తెరుచుకున్నాయి. 

Updated Date - 2020-06-04T21:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising