ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ డ్రగ్స్‌తో కరోనాకు స్వస్తి చెప్పచ్చు: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2020-03-17T01:16:11+05:30

కొవిడ్-19(కరోనా) విశ్వాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణించగా.. లక్షలాది మంది చికిత్స పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: కొవిడ్-19(కరోనా) విశ్వాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి వేలాది మంది మరణించగా.. లక్షలాది మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ఇప్పటివరకు మందు లేకపోవడంతో.. ప్రభుత్వాలు నియంత్రణ చర్యలను చేపట్టాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలోని యూనివర్శిటి ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు మందు ఉందంటూ ప్రకటన చేశారు. క్లోరోక్విన్, లోపినవిర్ అనే రెండు డ్రగ్స్ కరోనాను నయం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు డ్రగ్స్‌ను సహజంగా మలేరియా, హెచెఐవీ బాధితులకు ఉపయోగిస్తారు. అయితే కరోనాను నయం చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ టెస్ట్ ట్యూబ్‌లలో వైరస్‌ను తొలగించాయని రీసెర్చ్‌ను లీడ్ చేస్తున్న డేవిడ్ పీటర్‌సన్ తెలిపారు. ఈ చికిత్స చాలా ఉపయోగకరమైనదని.. చికిత్సానంతరం బాధితులలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించవని ఆయన అన్నారు. 


ఈ రీసెర్చ్‌ను ఆస్ట్రేలియా వ్యాప్తంగా విస్తరించి దీని ప్రభావం తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ముందుగా 50 ఆసుపత్రులను ఎంచుకుని ఈ రెండు డ్రగ్స్‌ను విడివిడిగా ఉపయోగిస్తే ఎటువంటి ఫలితం వస్తోంది.. కలిపి ప్రయోగిస్తే ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపై పనిచేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరు నుంచి క్లినికల్ ట్రయల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ముందుగా కొంతమందిపై ఈ డ్రగ్స్‌ను ప్రయోగిస్తే.. వచ్చే ఫలితాల ద్వారా కరోనా బాధితులకు మరింత సౌకర్యవంతంగా చికిత్స అందించవచ్చని డేవిడ్ అన్నారు. కాగా.. చైనాలో ఇప్పటికే అనేక మంది కరోనా బాధితులకు హెచ్ఐవీ డ్రగ్‌ను ఇవ్వగా.. మంచి ఫలితాలు ఇస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2020-03-17T01:16:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising