ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతిపెద్ద కాఫీ పెయింటింగ్.. గిన్నిస్ రికార్డు సాధించిన సౌదీ మహిళ

ABN, First Publish Date - 2020-10-19T08:56:14+05:30

ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌ను వేసి సౌదీ అరేబియాకు చెందిన ఒహద్ అబ్దుల్లా అలమాల్కీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌ను వేసి సౌదీ అరేబియాకు చెందిన ఒహద్ అబ్దుల్లా అలమాల్కీ అనే మహిళ గిన్నిస్ రికార్డును సాధించింది. ఒహద్ సౌదీ, యూఏఈకి చెందిన ఇద్దరు ప్రఖ్యాత నేతల చిత్రాలను 220 చదరపు మీటర్ల మేర గడువు తీరిన(ఎక్స్‌పైర్ అయిపోయిన) కాఫీ కణికలతో పెయింటింగ్ వేసింది. ఈ పెయింటింగ్‌కు ‘నాసీజ్ 1’ అని పేరు పెట్టింది. ఈ పెయింటింగ్‌ను గిన్నిస్ రికార్డ్స్‌లో చేర్చుతున్నట్టు గిన్నిస్ సంస్థ తెలిపింది. తనకు ఈ పెయింటింగ్ పూర్తి చేసేందుకు 45 రోజుల సమయం పట్టినట్టు ఒహద్ చెప్పింది. 


సౌదీ, యూఏఈ దేశాల మధ్య శతబ్దాల నుంచి ఉన్న భాగస్వామ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడమే తన లక్ష్యమని ఒహద్ తెలిపింది. సౌదీతో పాటు ఇతర దేశాల్లోని మహిళలను మరింత శక్తిమంతం చేసేందుకు తన విజయం దోహదపడుతుందని ఒహద్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. సౌదీకి చెందిన ఒక మహిళ ఒంటరిగా గిన్నిస్ రికార్డును సాధించడం ఇదే మొదటిసారి అని గిన్నిస్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. 2015లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు 8,264 మంది మహిళలు రియాద్‌లో అతిపెద్ద ‘హ్యూమన్ అవేర్‌నెస్ రిబ్బన్’ను తయారుచేసి గిన్నిస్ రికార్డు సాధించారు.

Updated Date - 2020-10-19T08:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising