ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెడ్డాలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ విధించిన సౌదీ...

ABN, First Publish Date - 2020-06-06T16:19:16+05:30

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ అరేబియా స‌ర్కార్... జెడ్డా న‌గ‌రం విష‌యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ అరేబియా స‌ర్కార్... జెడ్డా న‌గ‌రం విష‌యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జెడ్డాలో రోజురోజుకీ కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండ‌డంతో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. శ‌నివారం నుంచి రెండు వారాల పాటు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. మధ్యాహ్నం 3 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. అలాగే జెడ్డాలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థ‌ల కార్యాల‌యాల్లో ఉద్యోగులు ప‌ని చేయ‌డాన్ని కూడా నిషేధించింది. న‌గ‌రంలోని మసీదుల్లో ప్రార్థ‌న‌ల‌ను సైతం ర‌ద్దు చేసింది. దేశీయ విమానాలు, రైలు ప్రయాణాలు కొనసాగుతాయ‌ని చెప్పిన అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ... క‌ర్ఫ్యూ స‌మ‌యంలో కాకుండా మిగ‌తా వేళ‌ల్లో న‌గ‌రంలో ప్ర‌వేశానికి, బయ‌ట‌కు వెళ్లడానికి అనుమ‌తి ఇచ్చింది. రెస్టారెంట్లు, కేఫ్‌లు ఇకపై వారి ప్రాంగణంలో ఆహారం, పానీయాలను అందించడానికి వీలు లేదు. అలాగే ఒక‌చోట‌ ఐదు మందికి పైగా గుమ్మిగూడటం నిషేధించ‌బ‌డింది.        

Updated Date - 2020-06-06T16:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising