ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

ABN, First Publish Date - 2020-05-13T18:13:46+05:30

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంజా విసురుతున్న మ‌హమ్మారి క‌రోనా.. అటు గ‌ల్ఫ్‌లో కూడా విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంజా విసురుతున్న మ‌హమ్మారి క‌రోనా.. అటు గ‌ల్ఫ్‌లో కూడా విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లో విరుచుకుప‌డుతోంది. దాంతో కోవిడ్‌-19 క‌ట్ట‌డికి ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాలు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తాజాగా క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈద్ అల్ ఫిత‌ర్ సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో సెలవులు ఉండే ఆ ఐదు రోజుల్లో(మే 23 నుంచి 27 వ‌ర‌కు) సైతం సౌదీలో 24 గంట‌ల క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రానుంది. ఈ మేర‌కు అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌క్కా మిన‌హా సౌదీలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇదిలాఉంటే సౌదీలో స్వైర విహారం చేస్తున్న క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 264 మంది చ‌నిపోయారు. 42,925 మందికి ఈ వైర‌స్ సోకింది. 

Updated Date - 2020-05-13T18:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising