ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 2 ల‌క్ష‌లు దాటిన కేసులు

ABN, First Publish Date - 2020-07-04T14:43:16+05:30

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజురోజుకీ కొత్త‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజురోజుకీ కొత్త‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అంత‌కంత‌కు పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు తాజాగా 2 ల‌క్ష‌ల మార్కును దాటేశాయి. శుక్ర‌వారం న‌మోదైన 4,193 కొత్త కేసుల‌తో క‌లిపి దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ బారిన ప‌డ్డ వారి సంఖ్య 201,801కు చేరింది. 1,40,000 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యార‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కాగా, ఈ మ‌హ‌మ్మారి సౌదీ వ్యాప్తంగా ఇప్ప‌టికే 1,802 మందిని బ‌లిగొంది. ఇక‌ దేశంలో కోవిడ్‌-19 శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది హ‌జ్ యాత్ర‌కు ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే యాత్రికుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు సౌదీ స‌ర్కార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంతేగాక‌ హ‌జ్ యాత్ర కోసం మ‌క్కాకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని కోవిడ్ టెస్టు చేసిన త‌ర్వాతే అనుమ‌తించ‌డం జ‌రుగుతుందని నిర్వాహ‌కులు తెలిపారు. అయితే, దేశ‌వ్యాప్తంగా విధించిన‌ క‌ర్ఫ్యూలో ఇటీవ‌ల స‌డ‌లింపులు ఇవ్వ‌డంతోనే తాజాగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

Updated Date - 2020-07-04T14:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising