ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ విమానాలపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2020-12-28T14:08:39+05:30

సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూకేలో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూకేలో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మరో వారంపాటు పొడిగించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. భూ, జల మార్గాలను కూడా మరో ఏడు రోజులపాటు మూసివేస్తున్నట్టు తెలిపింది. కాగా..కొత్త రకం కరోనా వైరస్ మొదటగా బ్రిటన్‌లో బయటపడటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం తొలుత వారం రోజులపాటు దేశ సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంతో ఆ గడువును మరోవారం రోజులపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 3.62లక్షల మంది కొవిడ్-19 బారినపడ్డారు. ఇందులో 6వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-12-28T14:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising