ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీ రాజు సంచలన నిర్ణయం.. వాళ్లకు నో ఎంట్రీ..!

ABN, First Publish Date - 2020-06-23T17:04:59+05:30

సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి హజ్ యాత్రకు విదేశీయులను ఎవరినీ అనుమతించబోవడం లేదని ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాధ్: సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి హజ్ యాత్రకు విదేశీయులను ఎవరినీ అనుమతించబోవడం లేదని ప్రకటించారు. అదే సమయంలో ఇప్పటికే విదేశాల నుంచి సౌదీకి చేరుకున్న యాత్రికులను మాత్రం అనుమతిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, హజ్ యాత్రికుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సౌదీ అధికారులు తేల్చిచెబుతున్నారు. 


’ఇప్పటికే హజ్ సందర్శన కోసం సౌదీకి చేరుకున్న విదేశీయులను మాత్రమే ఈ ఏడాదికి అనుమతిస్తున్నాం. ఉమ్రాహ్ తోపాటు పలు సందర్శనీయ ప్రాంతాల్లో ఫిబ్రవరి 2020 నుంచే ఆంక్షలు ఉన్నాయి. విదేశీ యాత్రికులను ఈ ఏడాదికి నిలిపివేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని భావిస్తున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో హజ్ యాత్రికులను అనుమతిస్తే కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. మనుషుల ప్రాణాలను కాపాడాలని ఇస్లాం చెబుతోంది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం..‘ అని సౌదీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ప్రతి యేటా 25 లక్షలకు పైగా హజ్ యాత్రికులు ప్రపంచ దేశాల నుంచి సౌదీకి వస్తుంటారు. భారత్ నుంచి 2 లక్షల మందికి పైగా ముస్లింలు మక్కాను సందర్శిస్తుంటారు.

Updated Date - 2020-06-23T17:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising