ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా నుంచి బీరుట్‌కు ఐదు ఎయిర్‌క్రాఫ్ట్‌లు

ABN, First Publish Date - 2020-08-05T22:23:01+05:30

లెబనాన్ రాజధాని బీరుట్‌లో సంభవించిన భారీ పేలుళ్లు విషాదాన్ని మిగిల్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌లో సంభవించిన భారీ పేలుళ్లు విషాదాన్ని మిగిల్చాయి. మంగళవారం సంభవించిన ఈ పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 4 వేల మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. వీడియోను చూసిన వారంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. బీరుట్ ఓడరేవు ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేసినట్టు.. దీనివల్లే పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. ఇక లెబనాన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు రష్యా ప్రభుత్వం బుధవారం ఐదు ఎయిర్‌క్రాఫ్ట్‌లను బీరట్‌కు పంపనుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ప్రత్యేక మొబైల్ ఆసుపత్రి కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎయిర్‌క్రాఫ్ట్‌లలో వైద్యులు, రెస్క్యూ సిబ్బంది కూడా వెళ్లనున్నారు. వీటితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లలో కరోనాను కనుగొనే ప్రత్యేక లాబొరేటరి కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ప్రయాణించే సిబ్బంది ప్రత్యేక సూట్‌లు ధరించనున్నట్టు అధికారులు తెలిపారు.

Video Credts: Reuters

Updated Date - 2020-08-05T22:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising