ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలో 10వేలు దాటిన కరోనా మరణాలు..!

ABN, First Publish Date - 2020-07-05T23:45:10+05:30

కరోనా వైరస్ రష్యాలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 10వేల మందిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫో‌లోని సమాచారం ప్రకారం.. ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: కరోనా వైరస్ రష్యాలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 10వేల మందిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫో‌లోని సమాచారం ప్రకారం.. రష్యాలో శనివారం ఒక్కరోజే 6వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 168 మంది బలయ్యారు. దీంతో రష్యాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6.74లక్షలకు చేరింది. మహమ్మారి కారణంగా బలైన వారి సంఖ్య 10వేలు దాటింది. కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో రష్యా 3వ స్థానంలో ఉంది. కానీ.. మరణాల సంఖ్య పరంగా చూస్తే.. రష్యా దాదాపు 10వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. బ్రెజిల్‌లో మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. బ్రెజిల్‌లో నిన్న ఒక్కరోజే 1100పైగా కరోనా మరణాలు సంభవించాయి. కరోనా కేసులు, మరణాల సంఖ్య పరంగా బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 15లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 64వేలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. యూఎస్‌లో కరోనా బాధితుల సంఖ్య 29లక్షలు దాటింది. మహమ్మారి 1.32లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. 


Updated Date - 2020-07-05T23:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising