ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్‌-వి, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్లు కలిపేద్దాం

ABN, First Publish Date - 2020-11-28T13:05:42+05:30

అత్యంత ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రష్యా అధికారవర్గాలు వివాదాస్పద ప్రతిపాదన చేశాయి. ఆక్స్‌ఫర్డ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రష్యా అధికారవర్గాల వివాదాస్పద ప్రతిపాదన

లండన్‌, నవంబరు 27 : అత్యంత ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రష్యా అధికారవర్గాలు వివాదాస్పద ప్రతిపాదన చేశాయి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యాక్సిన్‌ను తమ స్పుత్నిక్‌-వితో జోడిస్తే.. వ్యాక్సిన్‌ పనితీరుకు ఇక ఎదురు ఉండదంటూ సంబంధిత అధికారులు ట్వీట్‌ చేయడం సంచలనాన్ని సృష్టించింది. రెండు వ్యాక్సిన్ల ఫార్ములాలతో ఏర్పడే కొత్త వ్యాక్సిన్‌ను రీవ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కీలక అస్త్రంగా వాడొచ్చని వారు పేర్కొన్నారు. ‘‘మీరు(ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ) పరీక్షించిన రెండు ఫుల్‌ వ్యాక్సిన్‌ డోసులు 62 శాతం ప్రభావశీలతనే కనబర్చాయి. ప్రభావశీలతను పెంచేందుకు మరోసారి ఇదే డోసేజీతో ప్రయోగ పరీక్ష చేపట్టాలని భావిస్తే.. స్పుత్నిక్‌-విని మీ(ఆక్స్‌ఫర్డ్‌) వ్యాక్సిన్‌తో కలిపి పరీక్షించి చూడండి’’ అని సూచించారు. ఈ రెండు వ్యాక్సిన్లూ ‘అడినో వైరల్‌ వెక్టర్‌’లతో అభివృద్ధి చేసినవే. అయితే స్పుత్నిక్‌-వి తయారీకి మనుషుల్లో జలుబుకు కారణమయ్యే అడినో వైర్‌సను, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కోసం చింపాజీల్లో జలుబుకు కారణమయ్యే అడినో వైర్‌సను వాడారు. 

Updated Date - 2020-11-28T13:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising