ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను తగ్గించే డ్రగ్‌ను పేషంట్లకు ఇచ్చేందుకు సిద్దమైన రష్యా

ABN, First Publish Date - 2020-06-01T23:28:42+05:30

కరోనా వైరస్‌ను నయం చేస్తుందని భావించి రష్యా ఇటీవల ఓ డ్రగ్‌ను అప్రూవ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: కరోనా వైరస్‌ను నయం చేస్తుందని భావించి రష్యా ఇటీవల ఓ డ్రగ్‌ను అప్రూవ్ చేసింది. ఈ డ్రగ్‌ను వచ్చే వారం నుంచి పేషంట్లకు ఇవ్వనున్నట్టు తాజాగా అధికారులు వెల్లడించారు. అవిఫావిర్ అనే పేరుతో రిజిస్టర్ చేసిన ఈ డ్రగ్‌ను జూన్ 11 నుంచి పేషంట్లకు ఇవ్వనున్నారు. నెలకు 60 వేల మంది పేషంట్లకు సరిపోయేలా ఈ డ్రగ్ ఉత్పత్తి జరగనున్నట్టు రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ సొవరైన్ వెల్త్ ఫండ్ హెడ్ తెలిపారు. రష్యాతో పాటు పలు దేశాల్లోని కరోనా పేషంట్లపై ఈ డ్రగ్‌ను ప్రయోగించారు. ఈ ప్రయోగంలో సత్ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. కరోనా వైరస్ వంటి ప్రమాదకరమైన వైరస్‌లకు సంబంధించిన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్‌ను నెలల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే రష్యా చెబుతున్న ఈ డ్రగ్‌ను 330 మంది పేషంట్లపై ప్రయోగించారు. నాలుగు రోజుల్లోనే ఈ డ్రగ్ కరోనా వైరస్‌ను నయం చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే మరిన్ని క్లినికల్ ట్రయిల్స్‌ను నిర్వహించకుండానే ఈ డ్రగ్‌ను అప్రూవ్ చేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా మూడో స్థానంలో ఉంది. రష్యా వ్యాప్తంగా ఇప్పటివరకు 4,14,878 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మొత్తంగా 4,855 మంది మరణించారు. 

Updated Date - 2020-06-01T23:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising