ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దేశం వాళ్లను రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన రష్యా

ABN, First Publish Date - 2020-02-19T23:40:56+05:30

రష్యాలో కరోనా(కొవిడ్-19) వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి రష్యాలోకి చైనీయుల రాకను నిషేధించిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యాలో కరోనా(కొవిడ్-19) వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి రష్యాలోకి చైనీయుల రాకను నిషేధించింది. చైనాతో దాదాపు 4,250 కిలోమీటలర్ల సరిహద్దును పంచుకుంటున్న  రష్యా.. కరోనా వైరస్ విజృంభించడంతో ఇప్పటికే సరిహద్దును మూసేసింది. తాజాగా.. ఫిబ్రవరి 20 నుంచి చైనీయులను తమ దేశంలోకి అనుమతించబోమని రష్యా ఉప ప్రధాని ప్రకటించారు. చైనా నుంచి రష్యా వెళ్లిన ఇద్దరు మహిళలకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారికి మెరుగైన చికిత్స అందించారు. ఇప్పుడు వారు పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈ రెండు కేసులు మినహా.. మరో కరోనా వైరస్ కేసు రష్యాలో నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో చైనీయుల రాకను రష్యా నిషేధించింది. కాగా.. ఈ వైరస్ బారినపడి చైనాలో దాదాపు 2వేల మంది మరణించిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-02-19T23:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising