ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలో ఒకేరోజు 8 వేలకు పైగా కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-29T05:07:27+05:30

రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రష్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 8,135 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 11,59,573కు చేరుకుంది. కొత్తగా బయటపడిన కేసుల్లో 2,200 మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదని రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. రష్యాలో నిత్యం అత్యధిక కరోనా కేసులు రాజధాని మాస్కో నుంచే వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా కరోనా బారిన పడి 61 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20,385కు చేరింది. ఇక ఒకేరోజు 2,702 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఈ సంఖ్య 9,45,920గా ఉంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. 

Updated Date - 2020-09-29T05:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising