ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌ ఎన్నికల్లో రష్యా జోక్యం.. ట్రంప్‌కు సహాయపడేలా ప్రయత్నాలు

ABN, First Publish Date - 2020-08-09T13:24:57+05:30

అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటూనే ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా రష్యా విభిన్న రకాల పద్ధతులను వినియోగిస్తోందని అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఆగస్టు 8: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటూనే ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా రష్యా విభిన్న రకాల పద్ధతులను వినియోగిస్తోందని అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సహాయ పడే విధంగా ప్రచారంలో జోక్యం చేసుకుంటోందని చెబుతున్నారు. అయితే చైనా మాత్రం ట్రంప్‌ రెండోసారి విజయం సాధించాలని కోరుకోవడం లేదని పేర్కొంటున్నారు. చైనాపై ట్రంప్‌ ఎప్పుడూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా చైనాపై ట్రంప్‌ అనేక ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశానికి నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ట్రంప్‌ కోసం రష్యా పని చేస్తోందన్న వాదనల పట్ల ఇంతకు ముందు శ్వేతసౌధం అభ్యంతరం తెలిపింది.

Updated Date - 2020-08-09T13:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising