ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించిన రష్యా

ABN, First Publish Date - 2020-08-23T05:23:44+05:30

రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు 3 కోట్ల 40 లక్షల 10 వేల కరోనా పరీక్షలు నిర్వహించిందని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 3,16,000

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు 3 కోట్ల 40 లక్షల 10 వేల కరోనా పరీక్షలు నిర్వహించిందని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 3,16,000 కరోనా పరీక్షలు చేసినట్టు పేర్కొంది. రష్యా జనాభా దాదాపు 15 కోట్లు ఉంటుంది. అంటే.. రష్యా ప్రభుత్వం ప్రతి పది లక్షల మందిలో 2.3 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. 2,20,288 మంది ప్రస్తుతం మెడికల్ పర్యవేక్షణలో ఉన్నట్టు ఆరోగ్యశాక తెలిపింది. కాగా.. రష్యా వ్యాప్తంగా ఇప్పటివరకు 9,46,976 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 16,189 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలు నిలిచాయి. అమెరికా అయితే కేసులు, మరణాల విషయంలో ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది.

Updated Date - 2020-08-23T05:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising