ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్ రైల్వే స్టేషన్‌లో కరోనాను హతమార్చే రోబోలు

ABN, First Publish Date - 2020-09-24T07:48:54+05:30

యూకేలో కరోనాను హతమార్చే రోబోలను అధికారులు రంగంలోకి దించారు. లండన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: యూకేలో కరోనాను హతమార్చే రోబోలను అధికారులు రంగంలోకి దించారు. లండన్‌లో నిత్యం రద్దీగా ఉండే సెయింట్ పాంక్రాస్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్‌లో ఈ సరికొత్త రోబోలను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల రైల్వేస్టేషన్లలో సెయింట్ పాంక్రాస్ రైల్వేస్టేషన్ ఒకటి. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఈ రైల్వేస్టేషన్‌ బోరుమంటోంది. పైగా యూకేలో కొవిడ్-19 సెకండ్ వేవ్ మొదలుకావడంతో ప్రజలు రైల్వేస్టేషన్‌లో ప్రయాణించాలంటే ఆందోళన చెందుతున్నారు. 


ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తాము సురక్షితంగా ఉన్నామని భావించి నమ్మకంతో రైల్వేస్టేషన్‌కు వచ్చేలా ఈ రోబోలను ఏర్పాటు చేసినట్టు రైల్వేస్టేషన్ హెడ్ జే న్యూటన్ చెబుతున్నారు. ఈ రోబోలు అల్ట్రావయిలెట్ లైట్‌ సహాయంతో ఎటువంటి డిస్‌ఇన్‌ఫెక్టెంట్ లేకుండానే పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ రోబోలోని టెక్నాలజీ ద్వారా 100 శాతం క్రిములు, కరోనాతో కలిపి నేలపై, చుట్టుపక్కల గాల్లో ఉన్న అన్ని రకాల వైరస్‌లు నిమిషాల్లో చనిపోతాయని జే న్యూటన్ చెబుతున్నారు. 

Updated Date - 2020-09-24T07:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising