ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు భారంగా మారిన బ్రిటన్ నిర్ణయం..!

ABN, First Publish Date - 2020-03-13T23:00:15+05:30

దీర్ఘకాల వీసాలపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు వలస వచ్చే వారిపై విధించే హెల్త్‌ ఫీజును అమాంతం 224 పౌండ్లు పెంచింది. భారత సంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: దీర్ఘకాల వీసాలపై బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు వలస వచ్చే వారిపై విధించే హెల్త్‌ ఫీజును అమాంతం 224 పౌండ్లు పెంచింది. భారత సంతతికి చెందిన రిషి సునక్.. బ్రిటన్‌ పార్లమెంట్‌లో తాజాగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బ్రిటన్‌కు వలస వచ్చే వారిపై విధించే హెల్త్ ఫీజును 400 పౌండ్ల నుంచి 624పౌండ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. భారత్ సహా ఇతర దేశాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చే వారు హెల్త్ ఫీజు కింద 624 పౌండ్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అయితే బ్రిటన్ హెల్త్ సర్వీస్ ద్వారా వలసదారులు లబ్ధి పొందొచ్చని రిషి సునక్ తెలిపారు. 


కాగా.. ఇమిగ్రేషన్ హల్త్ సర్‌ఛార్జీ(ఐహెచ్‌ఎస్)ని బ్రిటన్ మొదటగా 2015లో అమలు చేసింది. అనంతరం అదనపు నిధులపై దృష్టి సారించిన బ్రిటన్.. 2018 డిసెంబర్‌లో మొదటిసారిగా హెల్త్ ఫీజును 200 పౌండ్ల నుంచి 400 పౌండ్లకు పెంచింది. ఇదిలా ఉంటే.. రిషి సునక్ 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి  చేసుకున్న విషయం తెలిసిందే.  


Updated Date - 2020-03-13T23:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising