ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసాల రెన్యూవల్‌పై మరో కీలక ప్రకటన చేసిన యూఏఈ!

ABN, First Publish Date - 2020-07-13T16:30:17+05:30

వీసాల రెన్యూవల్‌పై యూఏఈ కీలక ప్రకటన చేసింది. వీసాల రెన్యూవల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో యూఏఈ.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: వీసాల రెన్యూవల్‌పై యూఏఈ కీలక ప్రకటన చేసింది. వీసాల రెన్యూవల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో యూఏఈ..  వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్‌కు సంబంధించి మూడు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ఆదేశించింది. ఈ క్రమంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) జూలై 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. కార్యాలయాల్లో రద్దీ వల్ల కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏ పేర్కొంది. ఇదిలా ఉంటే.. యూఏఈలో ఇప్పటి వరకు 54వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 333 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-13T16:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising