ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసాల రెన్యూవల్‌కు ఆఖరి గడువు అక్టోబర్ 10: దుబాయ్

ABN, First Publish Date - 2020-10-07T15:27:12+05:30

వీసాల రెన్యూవల్‌పై దుబాయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసాల గడువు ముగిసిన దుబాయ్ నివాసితులు తమ వీసాలను రెన్యూవల్ చేసుకోవడానికి అక్టోబర్ 10 ఆఖరు గడువు అని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: వీసాల రెన్యూవల్‌పై దుబాయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసాల గడువు ముగిసిన దుబాయ్ నివాసితులు తమ వీసాలను రెన్యూవల్ చేసుకోవడానికి అక్టోబర్ 10 ఆఖరి గడువు అని ప్రకటించింది. లేనిపక్షంలో దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒకవేళ డెడ్‌ లైన్ తర్వాత దేశంలో ఉంటే భారీ ఓవర్ స్టే జరిమానా విధిస్తామని పేర్కొంది. 


కాగా, వీసాల స్వయంచాలక పొడిగింపులకు సంబంధించి అన్ని తీర్మానాలను రద్దు చేయాలని యూఏఈ క్యాబినెట్ నిర్ణయించడంతో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్(ఐసీఏ) జూలై 12 నుంచి వీసా రెన్యూవల్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అమెర్ సెంటర్ ఉద్యోగులు, వీసా కన్సల్టెంట్స్... మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసాల గడువు ముగిసిన నివాసితులకు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ అక్టోబర్ 10తో ముగుస్తుంది. డెడ్ లైన్ తర్వాత దేశంలో ఉండే ఓవర్‌స్టేయర్‌లకు మొదటి రోజు 125 దిర్హమ్, రెండో రోజు నుండి రోజుకు 25 దిర్హమ్ల జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.   

Updated Date - 2020-10-07T15:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising