ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు బైడెన్ విజయాన్ని గుర్తించిన పుతిన్!

ABN, First Publish Date - 2020-12-15T21:04:33+05:30

అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన జో బైడెన్‌కు రష్యా అధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన జో బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు అభినందనలు తెలిపారు. కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వల్ల ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో 306 ఎలక్టోరల్ ఓట్లతో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ గెలుపొందినట్టు తేలింది. ఈ క్రమంలో దాదాపు ప్రపంచ దేశాధినేతలు అందరూ బైడెన్‌ను విష్ చేశారు. ఒక్క రష్యా అధ్యక్షుడు తప్ప. బైడెన్‌కు పుతిన్ శుభాకాంక్షలు తెలుపకపోగా.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను సమర్థిస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరు గెలుచారనే విషయం అధికారికంగా తేలే వరకు అభినందనలు తెలుపబోనని ప్రకటించారు.



ఈ నేపథ్యంలో సోమవారం రోజు అమెరికా అధ్యక్ష ఎన్నకల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 50 రాష్ట్రాలకు చెందిన ఎలక్టోర్స్ డిసెంబర్ 14న సమావేశమై అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను ఎన్నికున్నారు. దీంతో ట్రంప్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో స్పందించిన పుతిన్.. బైడెన్‌కు శుభాకాంక్షులు తెలిపారు. అంతేకాకుండా అమెరికాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ప్రపంచ భద్రతను పోత్రహించేందుకు ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. బైడెన్ ఏవిధంగా స్పందిస్తారనే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 


Updated Date - 2020-12-15T21:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising