ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీకౌంటింగ్‌కు భారీగా ఖర్చు చేసిన ట్రంప్.. ఆధిక్యం దక్కించుకున్న బైడెన్‌!

ABN, First Publish Date - 2020-11-28T23:59:26+05:30

తన ఓటమిని అంగీకరించని ట్రంప్.. ఎలాగైనా బైడెన్‌ను అధ్యక్ష పీఠం అధిరోహించకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: తన ఓటమిని అంగీకరించని ట్రంప్.. ఎలాగైనా బైడెన్‌ను అధ్యక్ష పీఠం అధిరోహించకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ అరిజోనా, పెన్సిల్వేనియా, జార్జియాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. కానీ, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్... వాటిని రుజువు చేసే సరియైన ఆధారాలు చూపలేక న్యాయస్థానంలో బొక్కబోర్లా పడ్డారు. ఇటీవల జార్జీయా, పెన్సిల్వేనియాలో బైడెన్ గెలిచినట్లు ఆయా రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ క్రమంలో బైడెన్ విజయం సాధించిన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ, డేన్ కౌంటీల్లో రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు ట్రంప్. 


దీనికోసం ఏకంగా 3 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. చివరకు ఇక్కడ కూడా ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. భారీ మొత్తం ఖర్చు చేసి మరీ రీకౌంటింగ్ జరిపిస్తే... అది కాస్తా బైడెన్‌కు ఫేవర్‌గా పరిణమించింది. ఇక్కడ ట్రంప్‌పై బైడెన్ 132 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. దీంతో ఈ రాష్ట్రంలో బైడెన్ మొత్తం ఆధిక్యం 20,600 ఓట్లకు చేరింది. ఇలా పట్టుబట్టి మరీ ట్రంప్ రీకౌంటింగ్ జరిపించగా.. అనూహ్యంగా బైడెన్‌‌కు ఆధిక్యం దక్కడంతో రిపబ్లికన్స్‌కు నోటమాట రాకుండా పోయింది.

Updated Date - 2020-11-28T23:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising