ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెక్సికోలో వెల్లువెత్తిన నిరసనలు.. పోలీసు అధికారికి నిప్పంటించిన దుండగుడు..!

ABN, First Publish Date - 2020-06-05T23:51:59+05:30

మెక్సికో‌లో నిరసనకారులు చెలరేగిపోయారు. ఓ పోలీసు అధికారికి నిప్పటించారు. అయితే తోటి పోలీసు అధికారులు.. స్థానికులు అప్రమత్తమవ్వడంతో సదరు పోలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెక్సికో: మెక్సికో‌లో నిరసనకారులు చెలరేగిపోయారు. ఓ పోలీసు అధికారికి నిప్పంటించారు. అయితే తోటి పోలీసు అధికారులు.. స్థానికులు అప్రమత్తమవ్వడంతో సదరు పోలీసు అధికారి ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్జి ఫ్లాయిడ్ ఉదంతంపై అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జార్జి ఫ్లాయిడ్‌ను హత్య చేసిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికో‌లో పోలీసులు ఓ వ్యక్తిపట్ల కిరాతకంగా వ్యవహరించారు. కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించలేదనే కారణంతో జియోవన్నీ లోపేజ్ అనే 30ఏళ్ల కార్మికుడిని పోలీసులు ఈ నెల 3న కొట్టిచంపారు. ఈ ఘటనతో మెక్సికో వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తాయి. అయితే కొన్ని చోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. మెక్సికో‌ రెండవ అతిపెద్ద నగరమైన గ్వాడలజరాలో.. నిరసనలు అదుపు చేయడానికి వెళ్లిన పోలీసు అధికారులపై ఆందోళనకారులు చెలరేగిపోయారు. ముఖానికి మాస్క్ ధరించి.. నల్లటి కళ్లద్దాలు పెట్టుకున్న ఓ నిరసనకారుడు.. పోలీసు అధికారికి నిప్పంటించాడు. దీంతో అప్రమత్తమైన ఇతర పోలీసు అధికారులు, స్థానికులు.. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరకు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.


Updated Date - 2020-06-05T23:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising