ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పెయిన్‌లో సరికొత్త యాప్‌ను డిజైన్ చేసిన రెస్టారెంట్.. ప్రత్యేకతలేంటంటే..

ABN, First Publish Date - 2020-08-04T21:02:05+05:30

స్విగ్గీ, జొమాటా యాప్‌ల వల్ల ఉపయోగం ఏంటని అడిగితే.. ఇంట్లో ఉండే ఫుడ్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలాప్రజెల్, స్పెయిన్: స్విగ్గీ, జొమాటా యాప్‌ల వల్ల ఉపయోగం ఏంటని అడిగితే.. ఇంట్లో ఉండే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చని ఎవరైనా టక్కున సమాధానం చెబుతారు. అదే రెస్టారెంట్‌కు వెళ్లి కూడా ఇదే రకంగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని అక్కడే తినేసి వస్తే? వినడానికి వింతగా ఉంది కదూ? రెస్టారెంట్‌కు వెళ్లాక మళ్లీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఎందుకు.. అక్కడ వెయిటర్లు ఉంటారుగా అని సందేహం రావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం మరీ ముఖ్యమని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందుకేనేమో స్పెయిన్‌లో ఓ రెస్టారెంట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను డిజైన్ చేసింది. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే.. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు ఈ యాప్ ఓపెన్ చేసి మెనూ చూడవచ్చు. మెనూలో నుంచి తమకు నచ్చిన ఐటమ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక ఇదే యాప్‌లో డబ్బును కూడా చెల్లించవచ్చు. 


ఆర్డర్ పెట్టిన వెంటనే అది రెస్టారెంట్ కిచెన్‌లో ఉన్న వారికి తెలుస్తుంది. అంతేకాకుండా తమ ఆర్డర్ రెడీ అవుతుందా? ఎంత సమయంలో వస్తుంది? అన్నది కూడా ట్రాక్ చేయవచ్చు. కోస్టా బ్రావాలోని పాలాఫ్రజెల్‌లో ఉన్న ఫంకీ పిజ్జా రెస్టారెంట్ ఈ వినూత్న ఐడియాను తీసుకొచ్చింది. ‘ఫంకీ పే’ పేరుతో ఈ యాప్‌ను తయారుచేశారు.  భౌతిక దూరం పాటించేందుకు తాము ఈ యాప్‌ను రూపొందించినట్టు రెస్టారెంట్ యజమాని కార్లస్ మానిక్ చెబుతున్నారు. అయితే రెస్టారెంట్‌లో కూడా యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం అన్నది బెటర్ ఐడియా కాదని జేవియర్ అనే కస్టమర్ చెబుతున్నాడు. ఈ యాప్‌లో ఆర్డర్ బుక్ చేయడం వల్ల రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఫీలింగ్ పోతోందని.. అంతేకాకుండా ఇతర సూచనలు చేయడానికి కూడా కుదరడం లేదని జేవియన్ తెలిపాడు.

Updated Date - 2020-08-04T21:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising