ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిలాడెల్ఫియాలోనూ ట్రంప్‌కు చుక్కెదురు !

ABN, First Publish Date - 2020-11-06T21:39:46+05:30

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిలాడెల్ఫియా ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిలాడెల్ఫియా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిలాడెల్ఫియా ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది. ట్రంప్ తరఫున రిపబ్లికన్ పార్టీ ప్రచార బృందం వేసిన దావాను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగానే రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు, పోల్ వాచర్లను కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతించడానికి నిరాకరిస్తున్నట్లు ట్రంప్ బృందం తన లాసూట్‌లో పేర్కొంది. అందుకే ఇక్కడి కౌంటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గురువారం ప్రచార బృందం ఫెడరల్ కోర్టు‌లో అత్యావసర పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ఫిలాడెల్ఫియాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న భవనంలోకి భారీ సంఖ్యలో రిపబ్లికన్ కార్యకర్తలు దూసుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది. అందుకే న్యాయస్థానం వారి దావాను తోసిపుచ్చింది.


ఇక మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ప్రాంతాల్లో ఈ విషయమై కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ట్రంప్ బృందం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును నిలిపివేయాలంటూ అక్కడి స్థానిక న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం కూడా ట్రంప్ 'స్టాప్ ది కౌంట్' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ట్రంప్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఓటమి భయంతోనే ఆయన ఇలా చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. 

Updated Date - 2020-11-06T21:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising