ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా ఎన్నికలు జరుగుతోంటే.. ట్విటర్‌లో ట్రెండ్ అవుతోన్న పనీర్ టిక్కా

ABN, First Publish Date - 2020-11-04T04:34:00+05:30

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు మంగళవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు మంగళవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రారంభమయ్యాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరపున జో బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఇప్పటికే పది కోట్ల మంది అమెరికన్లు ఎర్లీ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అమెరికా వ్యాప్తంగా పోలింగ్ బూత్‌లలో రద్దీ తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్విటర్ ఇండియాలో ‘అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు’ అన్న అంశం ట్రెండింగ్‌లో ఉంది. దీంతో పాటు పన్నీర్ టిక్కా అనే మరో అంశం కూడా ట్విటర్ ట్రెండింగ్‌లో ఉండటంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు పన్నీర్ టిక్కాకు, ట్విటర్ ట్రెండింగ్‌కు, అమెరికా ఎన్నికలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? 


భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ అనే మహిళ అమెరికన్ కాంగ్రెస్ మెంబర్‌గా ఉన్నారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె తాను తయారుచేసిన పన్నీర్ టిక్కా ఫొటోను తన ట్విటర్ ఖాతాలో సోమవారం రాత్రి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై ఆమె రాసుకొచ్చారంటే.. ‘ఎన్నికల ముందు రోజు రాత్రి చేసే పనేంటంటే.. మంచి ఆహారాన్ని వండుకోవడం. కమలా హ్యారిస్‌ తనకు ఉత్తర భారతదేశానికి చెందిన ఏ టిక్కా అయినా ఇష్టమని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. కమలా హ్యారిస్‌ను ఎన్నుకోబోతున్నందుకు గౌరవసూచకంగా ఈ రోజు రాత్రి పన్నీర్ టిక్కా చేశా. ప్రజలారా వెళ్లి ఓటు వేయండి’ అంటూ ప్రమీలా జయపాల్ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ అటు అమెరికాతో పాటు ఇటు భారత్‌లోనూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప్రమీలా జయపాల్ కేవలం ఈ వంటకం ఫొటోనే కాకుండా.. ఈ వంటకం రెసిపీకి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేయడం విశేషం.

Updated Date - 2020-11-04T04:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising