ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైజర్ టీకాకు పనామా గ్రీన్ సిగ్నల్ !

ABN, First Publish Date - 2020-12-16T19:44:11+05:30

అమెరికన్ ఔషధ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పనామా ఆమోదం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనామా: అమెరికన్ ఔషధ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పనామా ఆమోదం తెలిపింది. 2021 మొదటి త్రైమాసికంలో వ్యాక్సిన్ షిప్‌మెంట్ ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా అందిన వెంటనే మొదట హెల్త్ కేర్ వర్కర్స్, వయో వృద్ధులు, సెక్యూరిటీ సిబ్బందికి అందిస్తామని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక 4.2 మిలియన్ల జనాభా గల పనామాలో ఇప్పటివరకు 1.94 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. 3,382 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్న దేశాల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, మెక్సికోలతో పాటు గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్ కూడా ఫైజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా ఈ జాబితాలో పనామా చేరింది. కాగా, ప్రపంచంలోనే తొలిసారి ఫైజర్ వినియోగాన్ని ప్రారంభించింది మాత్రం బ్రిటన్. ఆ తర్వాత అమెరికా సోమవారం నుంచి వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది.   

Updated Date - 2020-12-16T19:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising