ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది విన్నారా.. కరోనా వైరస్‌కు కారణం చైనా కాదట!

ABN, First Publish Date - 2020-07-10T07:26:39+05:30

కరోనా వైరస్.. పుట్టినిల్లు చైనా అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే పాకిస్థాన్‌కు చెందిన రజా అలీకి మాత్రం బహుశా ఈ విషయం తెలియదో, లేక మిత్ర దే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్: కరోనా వైరస్.. పుట్టినిల్లు చైనా అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే పాకిస్థాన్‌కు చెందిన రజా అలీకి  మాత్రం బహుశా ఈ విషయం తెలియదో, లేక మిత్ర దేశానికి అండగా నిలవాలనుకున్నాడో. కరోనా వైరస్ వల్ల తనతో పాటు తన దేశం తీవ్రంగా నష్టపోయిందనీ.. అందుకు కారణం అమెరికానే అని ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. అందుకు అమెరికా నుంచి 20 బిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇప్పించాలంటూ లాహోర్‌లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే రజా అలీ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఇస్లామాబాద్‌లోని అమెరికా రాజబార కార్యాలయం, లాహోర్‌లోని అమెరికా కౌన్సిల్ జనరల్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఆరోపణలపై స్పందించాలని సదరు కార్యాలయాలను కోరుతూ విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. కాగా.. రజా అలీ చేసిన పని ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 2.37లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. దాదాపు 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.40లక్షల మంది కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 


Updated Date - 2020-07-10T07:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising