ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ కొత్త కుట్ర‌.. ఉరి శిక్షపై అప్పీలుకు జాదవ్ నిరాక‌ర‌ణంటూ‌..

ABN, First Publish Date - 2020-07-09T13:51:56+05:30

పాకిస్థాన్‌లో గూఢచర్యం కేసులో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్‌ జాదవ్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి నిరాకరించినట్లుగా పాకిస్థాన్‌ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షమాభిక్ష పిటిషన్‌పైనే పట్టు

పాకిస్థాన్‌ అదనపు ఏజీ వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌, జూలై 8: పాకిస్థాన్‌లో గూఢచర్యం కేసులో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్‌ జాదవ్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి నిరాకరించినట్లుగా పాకిస్థాన్‌ తెలిపింది. పాకిస్థాన్‌ ప్రభుత్వ అడిషనల్‌ అటార్నీ జనరల్‌(ఏఏజీ) అహ్మద్‌ ఇర్ఫాన్‌ బుధవారం ఈ విషయం మీడియా సమావేశంలో వెల్లడించారు. జాదవ్‌ లేదా ఆయన తరఫున ప్రతినిధి లేదా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ప్రతినిధి అప్పీలు చేసుకోవడానికి మే నెలలో ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉరి శిక్షను సవాలు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌ 17న జాదవ్‌ను ఆహ్వానించామని ఇర్ఫాన్‌ తెలిపారు. అయితే అప్పీలు వ్యాజ్యం దాఖలు చేసుకోరాదని జాదవ్‌ నిర్ణయించుకున్నారని, దానికి బదులుగా పెండింగ్‌లో ఉన్న తన క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం కోసం వేచి చూడాలని భావిస్తున్నారని పాకిస్థాన్‌ ఏఏజీ చెప్పుకొచ్చారు.  

Updated Date - 2020-07-09T13:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising