ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవతార్-2 షూటింగ్‌కు అనుమతిచ్చిన న్యూజిల్యాండ్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-06-08T22:24:51+05:30

దేశంలో యాక్టివ్ కేసులు లేకపోవడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్‌: దేశంలో యాక్టివ్ కేసులు లేకపోవడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు మొత్తం ఎత్తివేసింది. న్యూజిల్యాండ్ వ్యాప్తంగా అన్ని వ్యాపార కార్యకలాపాలు కూడా పూర్తిగా తెరుచుకున్నాయి. రవాణా రంగాన్ని కూడా పునరుద్దరించారు. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి వచ్చే వారిపై మాత్రం ఆంక్షలను కొనసాగించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే వారిని దేశంలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక అనుమతులు ఉండి.. విదేశీయుల వల్ల న్యూజిల్యాండ్ ఆర్థిక రంగానికి లాభం ఉంటుందనుకుంటేనే అనుమతిస్తామని చెప్పింది. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కేమరాన్‌కు న్యూజిల్యాండ్‌లో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులిచ్చింది. త్వరలోనే జేమ్స్ కేమరాన్ అవతర్ 2 షూటింగ్‌ను న్యూజిల్యాండ్‌లో మొదలుపెట్టనున్నారు. అవతార్ మొదటిభాగం 2009లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక అవతార్ రెండో భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 18న రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మరి కారణంగా ఈ సినిమాను 2021 డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు వెల్లడించారు.

Updated Date - 2020-06-08T22:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising