ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా

ABN, First Publish Date - 2020-02-27T14:59:03+05:30

12వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఓరియన్‌ మాల్‌లో గురువారం సాయంత్రం 6.30 గం టలకు కే.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ తెలుగు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఓరియన్‌ మాల్‌లో ‘శంకరాభరణం’ ప్రదర్శన

బెంగళూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 12వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఓరియన్‌ మాల్‌లో గురువారం సాయంత్రం 6.30 గం టలకు కే.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ తెలుగు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవాలలో ప్రదర్శించబడుతున్న ఏకైక తెలుగు సినిమా ‘శంకరాభరణం’ కావడం గమనార్హం. 60దేశాలకు చెందిన 225 చిత్రాలను మార్చి 4వరకు జరిగే బెంగళూరు సినిమా ఉత్సవంలో ప్రదర్శించనున్న సంగతి విదితమే. ఓరియన్‌మాల్‌, పీవీఆర్‌ సినిమా్‌సలో మొత్తం 11 తెరలపై దేశ విదేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనుండగా రాజాజీనగర్‌లోని నవరంగ్‌ థియేటర్‌, చామరాజపేటలోని కన్నడ చలనచిత్ర కళాకారుల సంఘం ఆడిటోరియం, బనశంకరి రెండో స్టేజ్‌లోని సుచిత్రా ఫిలిమ్‌ సొసైటీలో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్ర దర్శనలో కన్నడ సినిమాల కేటగిరీలో డా.శంకర్‌నాగ్‌ దర్శకత్వం వహించిన ‘మించిన ఓ ట’, డా.ఆదర్శ్‌ ఈశ్వరప్ప దర్శకత్వం వహించిన ‘భిన్న’, డా.దినేశ్‌బాబు దర్శకత్వం వ హించిన ‘అభ్యంజన’, జి.మూర్తి దర్శకత్వం వహించిన ‘సుగంధి’, వీరేంద్రశెట్టి దర్శకత్వం వహించిన ‘సవర్ణదీర్ఘసంధి’, సచిన్‌శెట్టి దర్శకత్వం వ హించిన ‘ఒందు షికారియ కథె’ చిత్రాలను ప్రదర్శించనున్నారు. 

Updated Date - 2020-02-27T14:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising