ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌ట్రాక్షన్ చిత్రం నా జీవితాన్నే మార్చేసింది: భారతీయ నటుడు

ABN, First Publish Date - 2020-09-15T01:52:26+05:30

ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వార్త్ భారత్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఎక్స్‌ట్రాక్షన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వార్త్ భారత్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఎక్స్‌ట్రాక్షన్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇక ఈ చిత్రంలో రుద్రాక్ష్ జైశ్వాల్(16) అనే భారత్‌కు చెందిన బాలుడు ప్రధాన పాత్ర పోషించాడు. రుద్రాక్ష్ జైశ్వాల్‌ను కాపాడే పాత్రలో క్రిస్ హెమ్స్‌వార్త్ నటించారు. ఇక ఈ చిత్రం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని రుద్రాక్ష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. క్రిస్ హెమ్స్‌వార్త్ తనతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నారని రుద్రాక్ష్ ఆనందం వ్యక్తం చేశాడు.


రుద్రాక్ష్ ఇంకా ఏం చెప్పాడంటే.. ‘ఎక్స్‌ట్రాక్షన్ చేయక ముందు నా జీవితమే వేరు. స్కూల్లో అందరూ నన్ను ఎగతాళి చేస్తూ కొడుతుండేవారు. నిత్యం నేను ఇంటికి ఏడుస్తూనే వెళ్లేవాడిని. ఎక్స్‌ట్రాక్షన్ చిత్ర షూటింగ్ మొదలైన తర్వాత క్రిస్ హెమ్స్‌వార్త్ నాకు ఎన్నో సలహాలు, సూచనలు చేస్తూ వచ్చారు. నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయననే అడిగేవాడిని. ఆయనే నాకు స్ఫూర్తి. వ్యక్తిగత జీవితానికి సంబంధించే కాకుండా యాక్టింగ్‌కు సంబంధించి కూడా ఆయన నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఎక్స్‌ట్రాక్షన్ చిత్రం విడుదలైన తర్వాత నన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వారే అభినందనలు తెలిపారు. నాతో స్నేహం చేయాలని ఉందని చెప్పారు’ అని రుద్రాక్ష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా.. రుద్రాక్ష్‌ ఎక్స్‌ట్రాక్షన్ చిత్రంతోనే తెరంగేట్రం చేశాడు. 

Updated Date - 2020-09-15T01:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising