ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భరత్‌ను దాటి.. చిట్టిబాబుకు చేరువలో బంటు..

ABN, First Publish Date - 2020-02-02T01:54:45+05:30

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో సినిమా వచ్చి 15 రోజులు దాటినా ఇంకా కలెక్షన్లు స్టడీగా ఉండడం విశేషం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ తన జోరు చూపిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది అమెరికాలో తొలి రెండు మిలియన్లు, మూడు మిలియన్లు సాధించిన హీరోగా అల్లుఅర్జున్ సరికొత్త రికార్డును సృష్టించాడు. 


ఇదే ఊపులో తాజాగా  ‘అల.. వైకుంఠపురములో..’  అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో నాల్గో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు 3.43 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 34 లక్షలు) రాబట్టిన ఈ మూవీ.. అంతకుముందు నాల్గో స్థానంలో ఉన్న మహేష్ బాబు చిత్రం 'భరత్ అనే నేను'(3.42 మిలియన్ డాలర్లు) వెనక్కి నెట్టింది.  అమెరికాలో రెండో వారం కూడా ఈ చిత్రం భారీగా కలెక్ట్ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. బంటు జోరు చూస్తుంటే ఈ వీకెండ్‌లోనే చిట్టిబాబును దాటేసి మూడో స్థానంలో నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


ఇక అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో 'బాహుబలి-2', 'బాహుబలి-1', 'రంగస్థలం' చిత్రాలు ఉన్నాయి. 'బాహుబలి-2' యూఎస్ బాక్సాఫీస్ వద్ద 20.77 మిలియన్ డాలర్లు(రూ. 147 కోట్ల 82 లక్షలు) కలెక్ట్ చేసి ఎవరికీ అందని ఎత్తులో ఉంటే, ఆ తర్వాత 7.51 మిలియన్ డాలర్ల(రూ. 53 కోట్ల 45 లక్షలు) వసూళ్లతో 'బాహుబలి-1' రెండో స్థానంలో ఉంది. 3.51 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 98 లక్షలు)తో 'రంగస్థలం' మూడో స్థానంలో ఉండగా... త్వరలోనే ‘అల.. వైకుంఠపురములో..’  దాన్ని అక్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం సినిమా విడుదలై 15 రోజులు దాటినా ఇప్పటికి యూఎస్‌లో లక్షల డాలర్లు కొల్లగోడుతోంది. ఆదివారం నాడు కూడా అక్కడి 115 సెంటర్లలో ఈ సినిమా ఏకంగా 66, 396 డాలర్లు రాబట్టడం దీనికి తార్కాణం. దీంతో అమెరికాలో నాన్-బాహుబలి రికార్డులన్నీ ‘అల.. వైకుంఠపురములో..’ వశం కావడమే తరువాయిగా మిగిలింది.


Updated Date - 2020-02-02T01:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising