ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో రికార్డుస్థాయి ముందస్తు ఓటింగ్ !

ABN, First Publish Date - 2020-10-31T14:19:47+05:30

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్‌. అయితే, ఇప్పటికే 8 కోట్లకు పైగా మంది ఓటేసేశారు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ డేటా గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో ఇంతా మంది ఓటర్లు ముందస్తుగా తమ ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌ డీసీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్‌. అయితే, ఇప్పటికే 8 కోట్లకు పైగా మంది ఓటేసేశారు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ డేటా గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో ఇంతా మంది ఓటర్లు ముందస్తుగా తమ ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే 2016లో పడిన మొత్తం ఓట్లలో 58 శాతం ఈసారి ఎన్నికల్లో ముందస్తుగానే బ్యాలెట్లకు చేరాయి. నవంబరు 3వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చంటున్నారు. కాగా, 2016లో ముందస్తుగా పోలైన మొత్తం ఓట్లు 47 మిలియన్లు మాత్రమే. 20 కీలక రాష్ట్రాల నుంచే ఈ మొత్తం ఓట్లు పడ్డాయని సమాచారం. 


మహమ్మారి కరోనావైరస్‌ ఉధృతి కొనసాగుతుండడంతో పోలింగ్‌ కేంద్రాలకు రావడానికి సాహసించని ఓటర్లు ఈసారి పోస్టల్‌, ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌కు మొగ్గుచూపుతున్నారు. ఈసారి అమెరికన్లు భారీగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, యువత కూడా ఓటింగ్‌పై ఆసక్తి చూపిస్తుండడంతో పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. 2016 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన మొత్తం 138 మిలియన్ ఓట్లను ఈసారి ఓట్ల సంఖ్య చాలా సులువుగా దాటిపోనుంది. కాగా, ఈ ముందస్తు ఓటింగ్‌ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే మొత్తం పోలింగ్‌ పూర్తయ్యాకే పోస్టల్‌, మెయిల్‌ ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుంది. ఈ లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. 

Updated Date - 2020-10-31T14:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising