ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్ మిషన్: యూఏఈ నుంచి స్వదేశానికి చేరిన 2.75లక్షల మంది భారతీయులు!

ABN, First Publish Date - 2020-08-03T16:16:27+05:30

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని యూఏఈలోని భారత కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని యూఏఈలోని భారత కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా.. ఇప్పటి వరకు 2.75లక్షల మంది ప్రవాసులు.. ఇండియాకు చేరుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లడానికి దాదాపు 5లక్షల మంది ప్రవాసులు.. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. యూఏఈలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు దుబాయి, షార్జాల నుంచి ఇండియాలోని ప్రధాన నగరాలకు దాదాపు 90.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ విమానాలు ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనున్నట్లు కాన్సులేట్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇవే కాకుండా ఎయిర్ అరబ్, ఎమిరేట్స్, స్పైస్‌జెట్, ఇండిగో తదితర విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 100 విమానాలను.. స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2020-08-03T16:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising