‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఇండియాకు వచ్చిన వారి సంఖ్య..!
ABN, First Publish Date - 2020-06-19T02:00:01+05:30
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటి వరకు ఈ మిషన్‌లో భాగంగా 2,50,087 మందిని ఇండియాకు తరలించినట్లు చెప్పారు. ఇందులో 21శాతం మంది వలస కార్మికులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి రోడ్డుమార్గం ద్వారా 75వేల మంది భారత్‌కు తిరిగొచ్చినట్లు వెల్లడించారు. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా స్వదేశానికి తిరిగి రావడానికి 4.50లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించారు. కాగా.. ‘వందే భారత్ మిషన్’ 3వ దశలో భాగంగా 41 దేశాలకు.. 550 విమానాలను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-06-19T02:00:01+05:30 IST