ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీబీఎం: స్వదేశానికి చేరిన 20.55 లక్షల మంది భారతీయులు!

ABN, First Publish Date - 2020-10-30T20:42:36+05:30

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించడం కోసం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’‌ ద్వారా ఇప్పటి వరకు 20.55లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించడం కోసం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’‌ ద్వారా ఇప్పటి వరకు 20.55లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ప్రస్తుతం ఏడో విడత వందే భారత్ మిషన్ కొనసాగుతుందని తెలిపారు. అక్టోబర్ 1న ప్రారంభమైన ఏడో విడత మిషన్ ద్వారా సుమారు 1.95లక్షల మంది భారత పౌరులు ఇండియాకు చేరుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా ‘వందే భారత్ మిషన్’ ఎనిమిదో విడతను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదిరిందన్న ఆయన.. త్వరలోనే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో వీసా సేవలను త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టూరిస్ట్ వీసా మినహా.. ఇతర వీసాలను భారత హైమికషన్ ద్వారా పొందొచ్చని తెలిపారు. 


Updated Date - 2020-10-30T20:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising