ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కాలంలో పెద్ద మనసు చాటుకున్న ఇండియన్ అమెరికన్లు!

ABN, First Publish Date - 2020-09-20T21:21:41+05:30

భారతీయ అమెరికన్లు తమ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో సుమారు 15వేల కుటుంబాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారతీయ అమెరికన్లు తమ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో సుమారు 15వేల కుటుంబాలకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కొవిడ్ విజృంభణ మొదలైన తొలినాళ్లలో అక్కడి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. తినడానికి తిండి దొరక్క చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొందరు ఇండియన్ అమెరికన్లు ఓ బృందంలా ఏర్పడి.. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా తదితర ప్రాంతాల్లో.. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచారు. ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులను అందజేసి వారి ఆకలి తీర్చారు. కరోనా వైరస్ విలయం మొదలైననాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15వేల కుటుంబాలకు.. ఇండియన్ అమెరికన్ల బృందం సాయం చేసింది. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 70లక్షల మంది కరోనా బారినపడగా.. మరణించిన వారి సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. 


Updated Date - 2020-09-20T21:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising